తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి...
తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి...

తుఫాన్ రైతులను నిండా ముంచింది...
తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి...
అంతర పంటల రైతులను ఆదుకోవాలి : బండారు సత్యానందరావు
తుఫాన్ హెచ్చరికలు ముందస్తుగా వున్నా రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందని కొత్తపేట నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు.కొత్తపేట మండలం అవిడి గ్రామంలో తడిసిన ధాన్యం రాసులను,సుడిగాలితో విరిగిపోయిన కొబ్బరి చెట్లను పరిశీలించారు. పంట పొలాలను పరిశీలించారు.తుఫాన్ హెచ్చరికలు వున్నా కల్లాల్లో దాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల ధాన్యం తడిసిపోయి రైతులు నష్టపోయారని అన్నారు.సుడిగాలి ప్రభావంతో సుమారు 60 కొబ్బరిచెట్లు విరిగిపోయాయని వాటికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరారు.తుఫాను గాలి ప్రభావంతో రాసులపై బరకాలు ఎగిరిపోయి దాన్యం తడసిపోయిందని తెలిపారు.తుఫాను గాలికి కూలిపోయిన పాకలకు సైతం నష్టపరిహారం చెల్లించాలని సత్యానందరావు కోరారు.లేకుంటే రైతుల తరుపున తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని సత్యానందరావు హెచ్చరించారు.గత మూడు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలివెల గ్రామం పూజారిపాలెంలో నీట మునిగిన ఇళ్లను పరిశీలించారు.ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వహిస్తుందని ప్రజల కష్టాలు చూసైనా తక్షణమే ప్రభుత్వం స్పందించాలని సత్యానందరావు కోరారు.